Billionaire Hinduja Family: హిందుజా గ్రూప్‌ కుటుంబానికి భారీ షాక్‌.. నాలుగేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ స్విస్‌కోర్టు తీర్పు..

Billionaire Hinduja Family Members Gets Jail: హిందుజా గ్రూప్‌ కుటుంబ సభ్యులకు భారీ షాక్‌, నలుగురు కుటుంబ సభ్యులకు స్వట్జర్లాండ్‌ జెనివా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంట్లో పనిచేసే వారికి తగిన వేతనం చెల్లించకపోవడం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని  శుక్రవారం రోజు ఈ జైలు శిక్ష విధించింది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 22, 2024, 09:42 AM IST
Billionaire Hinduja Family: హిందుజా గ్రూప్‌ కుటుంబానికి భారీ షాక్‌.. నాలుగేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ స్విస్‌కోర్టు తీర్పు..

Billionaire Hinduja Family Members Gets Jail: హిందుజా గ్రూప్‌ కుటుంబ సభ్యులకు భారీ షాక్‌, నలుగురు కుటుంబ సభ్యులకు స్వట్జర్లాండ్‌ జెనివా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంట్లో పనిచేసే వారికి తగిన వేతనం చెల్లించకపోవడం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని  శుక్రవారం రోజు ఈ జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే భారత మూలాలున్న హిందుజా సంపన్న కుంటుంబం.  ముఖ్యంగా నిరక్షరాస్యులైనా భారతీయులను జెనివాలో తమ విల్లాలో పనులకు నియమించుకుని అతి తక్కువ వేతనాలను చెల్లిస్తున్నారు. వీరి పాస్‌పోర్ట్‌ వీసాలను సైతం స్వాధీనం చేసుకుని అమాయకులైన పనివారిని హింసిస్తున్నారనే ఆరోపణలతో ఈ శిక్ష విధించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ హిందుజా, భార్య, కొడుకు, కోడళ్లకు కూడా నాలుగున్నరేళ్లపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు జెనివా కోర్టు తీర్పునిచ్చింది.

హిందుజా కుటుంబం ముఖ్యంగా స్విట్లర్లాండ్‌ చట్టాన్ని అతిక్రమించిందని, పనివారిని విల్లాను వదిలి ఎక్కడికి వెళ్లకుండా నిర్భందించారని, జీతాలు కూడా అక్కడి కరెన్సీలో కాకుండా ఇండియన్‌ రూపీలో భారత బ్యాంకుల్లో డబ్బులు జమా చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పుకొచ్చింది. కాగా, స్విస్ పౌరసత్వం పొందిన హిందుజా కుటుంబం గతంలో కూడా ఇలాంటి కేసులో కూడా దోషిగా తేల్చింది. అంతేకాదు అక్కడి ట్యాక్సుల విషయాల్లో కూడా ఈ కుటుంబం కేసులను ఎదుర్కొంటోంది. అయితే, ఈ జైలు శిక్ష తీర్పు వెల్లడించిన సమయంలో కోర్డుకు ఏ ఒక్క హిందుజా కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. వారి తరఫున కేవలం మేనేజర్‌ నజీబ్ జియాజీ మాత్రమే హాజరు అయ్యారు. ఆయనకు కూడా 18 నెలలపాటు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత సస్పెండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఒరేయ్ బుద్ధి లేదా..? 72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు వివాహం.. పోలీసులు దిమ్మతిరిగే ట్విస్ట్

అయితే, అక్కడి వచ్చిన పనివారికి ముందుగానే నియమ నిబంధనలు తెలుసుకుని ఒప్పుకొని వచ్చారని మానవ అక్రమ రవాణా జరగలేదు. కానీ, వారి నుంచి పాస్ట్‌పోర్ట్‌, వీస్సా స్వాధినం చేసుకోవడం, 18 గంటలపాటు పనివారితో పనిచేయించుకోవడం, ఇండియన్ రూపాయిలో జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ జైలు శిక్ష విధిస్తున్నట్లు జెనివా కోర్టు తీర్పునిచ్చింది. అంటే పనివారికి స్విస్‌ రూల్‌ ప్రకారం 1/10వ వంతు మాత్రమే హిందుజా ఫ్యామిలీ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే వారి పెంపుడు కుక్కకు ఏడాదికి పెడుతున్న ఖర్చే పనివారికి చెల్లిస్తున్న జీతం కంటే ఎక్కువ. ఈ తీర్పును సవాలు చేయనున్నట్లు హిందుజా ఫ్యామిలీ తెలుపుతోంది.

ఇదీ చదవండి: మక్కా హజ్ యాత్రలో ఘోర విషాదం, ఎండ వేడిమికి 9 వందల మంది మృతి, 68 మంది భారతీయులు కూడా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News